Income TaxIncome Tax

INCOME TAX ఆదాయపు పన్ను వివరాలు

Financial year 2022-2023 Assesment year 2023-2024

  స్టాండర్డ్ డిడక్షన్

50,000 రూపాయలు ప్రతి ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది.

హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్

రెండు లక్షల రూపాయల వరకు ఇంటి ఋణముపై వడ్డీ మినహాయింపు ఉంటుంది.

టాక్స్ స్లాబ్స్ (Below 60 years) Financial year 2022-2023

             Old Tax Regime                                                                                  

          2,50,000 వరకు Nil                                                                          

          2,50,001 -5,00,000  5%                                                                 

          5,00,001-10,00,000   20%                                                            

          10,00,000 పైన    ౩౦% 

New Tax Regime                                                                      

 2,50,000 వరకు Nil

2,50,001 -5,00,000 5%

5,00,001-7,50,000 10%

7,50,001-10,00,000 15%

10,00,001-12,50,000 20%

12,50,001-15,00,000 25%

15,00,000 పైన  30%

60 to 80 సంవత్సరాలు వారికీ కి ఒక టాక్స్ స్లాబ్స్ విదానం, 80 సంవత్సరాలు పైన వయస్సువారికీ మరొక టాక్స్ స్లాబ్ విదానం ఉంటుంది.

INCOME TAX  సెక్షన్ 80C  Deductions

ఈ సెక్షన్ కింద 1,50,000 రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు .80C సెక్షన్ పరిధిలోకి వచ్చేవి.

1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. PPF

2. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్. EPF

3. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. NSC

4. సుకన్య సమృద్ధి యువజన.SSY

5. ఫిక్స్డ్ డిపాజిట్ ( ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగినవి) FD

6. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం. ELSS MUTUAL FUNDS.

7. నేషనల్ పెన్షన్ స్కీం .NPS.

8. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్( సెల్ఫ్, స్పౌజ్, చిల్డ్రన్ పేరుమీద ఉన్న పాలసీలు. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పాలసీలు వర్తించవు.)

9. హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్.

10. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఏదైనా ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసినప్పుడు.

11. పిల్లల ట్యూషన్ ఫీజు.

సెక్షన్80 CCD1B

నేషనల్ పెన్షన్ స్కీం NPS లో50,000 రూపాయలు వరకు అదనంగా పొదుపు చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 D

సెల్ఫ్, స్పౌజ్, వారి పిల్లల కు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లకు 25000 రూపాయల వరకు టాక్స్ మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్ అయితే 50,000 రూపాయల వరకు టాక్స్ మినహాయింపు ఉంటుంది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి 5000 వరకు గరిష్టంగా మినహాయింపు ఉంటుంది.

తల్లిదండ్రులకు 25,000 రూపాయల కొరకు పన్ను మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ అయితే 50,000 రూపాయలు మినహాయింపు ఉంటుంది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి 5000 రూపాయలు మినహాయింపు ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని సీనియర్ సిటిజన్స్ విషయంలో వైద్య ఖర్చులకు 50వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. వారి తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు 50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 DD

దివ్యాంగుల డిజేబులిటీ మెడికల్ ట్రీట్మెంట్ కి 75000 మినహాయింపు కలదు. దివ్యాంగుల సవేర్ డిజేబులిటీ( 80% కంటే అధికం) మెడికల్ ట్రీట్మెంట్ కి1,25,000 రూపాయల కొరకు టాక్స్ మినహాయింపు కలదు.

సెక్షన్ 80 DDB

సెల్ఫ్, డిపెండెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కొన్ని ఎంపిక చేసిన వ్యాధులకు 40 వేల రూపాయల వరకు మినహాయింపు కలదు. సీనియర్ సిటిజనులకు ఒక లక్ష వరకు మినహాయింపు కలదు.

సెక్షన్ 80 E

విద్యా రుణం(ఎడ్యుకేషన్ లోన్) మీరు కానీ మీ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ మొత్తం పై చెల్లించే వడ్డీ పై 80 E కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80 EE

1 ఏప్రిల్ 2016-31 ఫస్ట్ మార్చ్ 2017 మధ్యన రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొన్నవారికి 50,000 వడ్డీ మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 EEA

1 ఏప్రిల్2019- 31 మార్చ్ 2022 మధ్యన రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వారికి వడ్డీ మినహాయింపు1, 50,000 రూపాయలు వడ్డీ మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 G

గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్ ఇచ్చినట్లయితే పన్ను మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 GG

ఉద్యోగి హౌస్ రెంట్ అలవెన్స్( ఇంటి భత్యం) పొందకపోతే ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80 GGA

సైంటిఫిక్ రీసెర్చ్ సోషల్ సైన్స్, స్టాటస్టికల్ రీసెర్చ్, రూరల్ డెవలప్మెంట్ కు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు డొనేషన్ చెల్లించినట్లయితే టాక్స్ మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80GGC

రాజకీయ పార్టీలకు విరాళాలు అందించినట్లయితే పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80 TTA

సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చు వడ్డీకి పదివేల రూపాయలు వరకు మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 TTB

సీనియర్ సిటిజనుల బ్యాంక్ డిపాజిట్ పై వచ్చే వడ్డీకి 50వేల రూపాయలు వరకు మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 U

పన్ను చెల్లింపు దారుడు డిజేబులిటీ కలిగి ఉన్నట్లయితే 75 వేల రూపాయలు వరకు మినహాయింపు కలదు. 80 % కంటే ఎక్కువ డిజేబులిటీ కలిగి ఉన్నట్లయితే1,25,000 రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది.

INCOME TAX