పొదుపు పథకాలు SAVING SCHEMES
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF
TAX SAVING SCHEMES లో అత్యంత సురక్షితమైన పొదుపు పథకం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినది. ఈ పథకంలో కనీస పెట్టుబడి 500 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పొదుపును నెల నెల చెల్లించవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. వడ్డీ రేటును సంవత్సరానికి నాలుగు సార్లు అనగా క్వార్టర్లీగా నిర్ణయిస్తారు. ఈ పథకం కాల పరిమితి 15 సంవత్సరాలు. అధిక రిటర్న్ ఇచ్చే పథకము. ఈ పథకంలో పొదుపు చేసిన మొత్తానికి సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రవేట్ సెక్టార్ బ్యాంక్ లో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ ప్రారంభించవచ్చు.18 సంవత్సరాలు నిండిన భారతీయులు ఎవరైనా ఈ ఖాతాని ప్రారంభించవచ్చు. ప్రవాస భారతీయులు ఈ ఖాతాని ప్రారంభించడానికి వీలు లేదు. పిల్లల విద్య మరియు ఆరోగ్యం కోసం మధ్యలోనే ఉపసంహరించుకోవచ్చు. మూడు సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే 25% లోన్ పొందవచ్చు. లోన్ మీద 2% అదనంగా వడ్డీ రేటు ఉంటుంది. 7 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే50% లోన్ పొందవచ్చు.
ప్రతినెల 5 వ తేదీ నాటికి ఉన్న మొత్తానికి వడ్డీని నిర్ణయిస్తారు. కాబట్టి ప్రతి నెల5 వ తేదీ లోపల డిపాజిట్ చేస్తే మంచిది. సంవత్సరానికి ఒకసారి డిపాజిట్ చేస్తే ఏప్రిల్ 5 నాటికి ఉన్న బ్యాలెన్స్ కి వడ్డీని నిర్ణయిస్తారు.
PPF లో ప్రస్తుత వడ్డీ రేటు2023 జనవరి నాటికి 7.1%.
2 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC
పోస్ట్ ఆఫీస్ ద్వారా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా మంచి పథకం. కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కాలపరిమితి 5 సంవత్సరాలు. పెట్టుబడి పెట్టినప్పుడు ఉన్న వడ్డీ రేటు 5 సంవత్సరాలు వరకు అదే వడ్డీ రేటు ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C ప్రకారం1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకాన్ని ప్రారంభించాలి అంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఏదైనా బ్యాంకులోNSC సర్టిఫికెట్ ని సెక్యూరిటీగా డిపాజిట్ చేసి లోన్ పొందవచ్చు. ఈ సర్టిఫికెట్ ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ కు బదిలీ చేసుకోవచ్చు.
NSC లో ప్రస్తుత వడ్డీ రేటు 2023 జనవరి నాటికి 6.8 %
౩. కిసాన్ వికాస్ పత్రం KVP
* పోస్ట్ ఆఫీస్ లలో లేదా బ్యాంకులలో ఈ పత్రాన్ని పొందవచ్చు.
*కనీస పెట్టుబడి 1000 రూపాయలు నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
* ఒకేసారి పెట్టుబడి పెట్టాలి.
* భారతీయ పౌరుడి ఉండి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
* పోస్ట్ ఆఫీసులలోనూ బ్యాంకులలోను ఈ అకౌంట్ ని ప్రారంభించవచ్చు.
* నామిని వివరాలు సమర్పించాలి.
* అకౌంటు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ కి ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ట్రాన్స్ఫర్ పొందవచ్చు.
* కిసాన్ వికాస పత్రం సెక్యూరిటీగా చూపించి లోన్ పొందవచ్చు.
* కిసాన్ వికాస పత్రం ప్రస్తుత వడ్డీ రేటు2023 జనవరి నాటికి 7.2%
4. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం.
ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి ప్రతినెల వడ్డీని మన అకౌంట్లో జమవుతుంది. ఈ పథకం కల పరిమితి ఐదు సంవత్సరాలు. కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 4,50,000 రూపాయలు వరకు డిపాజిట్ చేయవచ్చు.
5. సుకన్య సమృద్ధి యోజన SSY
బాలికల విద్య మరియు వివాహమునకు మంచి పొదుపు పథకం. ఎక్కువ వడ్డీ లభించే పథకం.250 రూపాయలు నుంచి1,50,000 రూపాయలు వరకు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతSSY వడ్డీ రేటు2023 జనవరి నాటికి 7.6 %.
6. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
7. రికరింగ్ డిపాజిట్ RD
ఉద్యోగస్తులు, ప్రతినెల నిర్ణీత అమౌంట్ వచ్చేవారు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. ప్రతినెల డిపాజిట్ చేయాలి.
8. ఫిక్స్ డ్ డిపాజిట్ లు FD
మన దగ్గర ఉన్న మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు దీనినే టర్మ్ డిపాజిట్ అని అంటారు. నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఐదు సంవత్సరాల కన్న ఎక్కువ కాల పరిమితి కలిగిన డిపాజిట్లు సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు.