Teachers Transfers ScheduleTeachers Transfers Schedule

Teachers Transfers Schedule ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లు ఈ బదిలీలకు అర్హులు.ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 సెక్షన్ 78, 79 మరియు ఆర్టికల్ 309 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గతంలో నిర్వహించిన బదిలీల మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం Teachers Transfers Schedule జీవో ఎంఎస్ నెంబర్ 187 తేదీ 10. 12. 2022న మార్గదర్శకాలు విడుదల చేశారు. 

* ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు.

బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు

ఖాళీల వివరాలు వెబ్సైట్ లో ప్రదర్శన                  12. 12. 2022 నుంచి13.12 2022 వరకు

ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం              14.12. 20 22 నుంచి 17. 12. 20 22 వరకు

అప్లికేషన్ వెరిఫికేషన్                                         18. 12. 20 22 నుంచి 19. 12. 20 22 వరకు

ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన

అభ్యంతరాల స్వీకరణ                                         20.12.2022 నుంచి 22. 12. 2022 వరకు

ఫైనల్ సీనియార్టీ లిస్ట్ ప్రదర్శన                              26. 12.2022

వెబ్ ఆప్షన్ల నమోదు                                            27. 12. 2022 నుంచి 01. 01. 2023 వరకు

బదిలీ పొందిన పాఠశాల స్థానాల కేటాయింపు          02. 01. 2023 నుంచి 10. 01. 2023 వరకు

కేటాయింపులలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరణ 11. 01. 2023

బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకొనుట 12. 01. 2023

బదిలీలకు అర్హతలు

* గ్రేడ్ 2 హెడ్మాస్టర్ లకు 5 అకడమిక్ సంవత్సరాలు. ఎస్ జి టి/ ఎస్ఏ ఉపాధ్యాయులకు 8 అకడమిక్ సంవత్సరాలు.

( అకడమిక్ సంవత్సరంలో సగం కంటే ఎక్కువ కాలం పూర్తి చేసినట్లయితే ఒక అకడమిక్ సంవత్సరంగా పరిగణిస్తారు. సంవత్సరంలో సగం కంటే తక్కువగా ఉంటే అకడమిక్ సంవత్సరంగా పరిగణించరు.)

* 31. 08. 2024 లోపల పదవీ విరమణ పొందే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లు మరియు ఉపాధ్యాయుల కు బదిలీల నుంచి మినహాయింపు ఉన్నది.

* జీరో సర్వీస్ సర్వీస్ నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* 31. 08. 2022 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురుష గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లు/ ఉపాధ్యాయులు బాలికల పాఠశాల లలో బదిలీని పొందవచ్చు.

రీ ఆ పోర్షన్

* ఏదైనా పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్ట్ మిగులు గా ఉంటే రీ ఆపోర్షన్ గా పరిగణిస్తారు.

* ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసి ఆ పోస్టు మిగులు గా ఉంటే ఆ పోస్టును బదిలీ చేస్తారు.

* 8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి కాకుండా ఒక పాఠశాలలో పోస్టులు మిగులు ఏర్పడితే సీనియర్ టీచర్ విల్లింగ్ ఉంటే బదిలీ కోరవచ్చు. లేకుంటే జూనియర్ టీచర్ తప్పనిసరి బదిలీ కావాలి.

* 2020 బదిలీలలో బదిలీ కబడి రి ఆ పోర్షన్ కు గురైతే మ్యాపింగ్ చేయబడిన పాఠశాలలోని ఉపాధ్యాయులకు 5 పాయింట్లు కేటాయించబడి తాయి.

* ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు csc ప్రొసీడింగ్స్ 14. 10. 2021 ప్రకారం తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి.

ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్

జిల్లాను యూనిట్ గా తీసుకుని బదిలీలు జరుగుతాయి.

ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్

కేటగిరి 1 కి – 1 పాయింట్

కేటగిరి 2 కి – 2 పాయింట్లు

కేటగిరి 3 కి – 3 పాయింట్లు

కేటగిరి 4 కి – 4 పాయింట్లు

హాబి టేషన్/ పట్టణాలు కేటగిరీలను క్రింది విధంగా వర్గీకరించారు.

కేటగిరి 1 – ఆర్ పి ఎస్- 2015 20 % హెచ్ ఆర్ ఏ, ఆర్ పి ఎస్- 2020 16% హెచ్ ఆర్ ఏ

కేటగిరి 2- ఆర్ పి ఎస్- 2015 14. 5% హెచ్ ఆర్ ఏ, ఆర్ పి ఎస్- 2020 12% హెచ్ ఆర్ ఏ

కేటగిరి 3- ఆర్ పి ఎస్- 2015 12% హెచ్ ఆర్ ఏ , ఆర్ పి ఎస్- 2020 10% హెచ్ ఆర్ ఏ

కేటగిరి 4- ఆర్ పి ఎస్- 2015 12 % హెచ్ ఆర్ ఎ, ఆర్ పి ఎస్ 2020 10% హెచ్ ఆర్ ఏ మరియు రోడ్స్ అండ్ బిల్డింగ్స్/ పంచాయతీ రాజ్ నిబంధనల ప్రకారం రోడ్ కనెక్టివిటీ లేనివి మరియు ఏజెన్సీలోని పాఠశాలలు.

స్పెషల్ పాయింట్స్

* అవివాహిత మహిళ ఉపాధ్యాయిని లకు/ ప్రధాన ఉపాధ్యాయిని లకు 5 పాయింట్లు.

* spouse కేటగిరి కలిగిన వారికి 5 పాయింట్లు.

* ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, విజువ లీ, ఆర్తో ఛాలెంజ్ డ్ 40%- 55% వారికి- 5 పాయింట్లు.

* ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ విజువల్, ఆర్తో ఛాలెంజ్ డ్ 56%- 69% వారికి- 10 పాయింట్లు.

* రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ లకు -5 పాయింట్లు.

ప్రిపరెన్సియల్ కేటగిరి

ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో సంబంధం లేకుండా ప్రీఫరెన్షియల్ కేటగిరి అభ్యర్థులకు బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వబడును.

* 70% కంటే ఎక్కువ డిజేబుల్ టి కలిగిన విజువలీ, ఆర్తో ఉద్యోగులు.

* మనసిక వైకల్యం కల పిల్ల లు కలిగిన ఉద్యోగులు.

* మెడికల్ గ్రౌండ్ డిసీజెస్ కలిగిన ఉద్యోగులు.

* వితంతువులు.

* లీగల్ సేపరేటెడ్ ఫీమేల్స్.

* ఎక్స్ సర్వీస్మెన్ లు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నట్టు అయితే.

ఖాళీలు

*30. 11. 2022 నాటికి అన్ని క్లియర్ వేకెన్సీ లు ఖాళీలు గా చూపబడుతాయి.

* ప్రమోషన్ పొందిన వేకెన్సీ లు ఖాళీలు గా చూపబడుతాయి.

* కంపల్సరీ బదిలీలు ఖాళీ లు గా చూపబడుతాయి.

రిలీవ్ అండ్ జాయినింగ్

*బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే గ్రేడ్2 ప్రధాన ఉపాధ్యాయులు/ ఉపాధ్యాయులు పాఠశాల నుంచి రిలీవ్ అయ్యి కొత్త పాఠశాలలో జాయినింగ్ కావలసి ఉంటుంది అయితే ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా 50% ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉండాలి.

* సింగిల్ టీచర్ పాఠశాలలో ఉపాధ్యాయులు రిలీవ్ కాకూడదు. ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు వచ్చు వరకు.

* ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు అయితే ఒకరు సీనియర్ ఉపాధ్యాయులు రిలీవ్ కావాలి, జూనియర్ ఉపాధ్యాయుడు రిలీవ్ కాకూడదు.

* ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తుంటే ఒకరు రిలీవ్ కావాలి.

* నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తుంటే ఇద్దరు రిలీవ్ కావాలి.

* అలాగే 11 మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే ఐదు మంది రిలీవ్ కావాలి ఆరు మంది రిలీవర్స్ వచ్చేవరకూ పని చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు Teachers Transfers Schedule GO NO 187 చదవగలరు.