కేంద్ర ప్రభుత్వం బాలికల విద్య మరియు వివాహం కోసం కుటుంబ ఆర్థిక భద్రత కోసం Sukanya Samriddi Yojana పథకాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రజాదరణ పొందిన పథకము గా చెప్పవచ్చు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో బాలికల ఆర్థిక సాధికారత కోసం మగ పిల్లలతో సమానఅవకాశాల కోసం ఈ Sukanya Samriddi Yojana పథకాన్ని ప్రారంభించారు. అర్హతలు: భారత ప్రభుత్వం 10 సంవత్సరాల లోపు బాలికలకు ప్రవేశపెట్టిన మంచి పథకం. ఒకరి పేరు మీదుగా ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువమందికి అవకాశం లేదు. అయితే మొదటిసారి ఒక బాలిక జన్మించి రెండోసారి కవలలు జన్మించినట్లు అయితే 3 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. మొదటిసారి కవలలు జన్మించి రెండవ సారి బాలిక జన్మించినట్లు అయితే మూడవ అకౌంట్ కు అర్హత లేదు. అయితే ఎన్నారైలు ఈ స్కీము లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు.
1 బాలిక ఆధార్ కార్డ్. 2 బాలిక బర్త్ సర్టిఫికెట్. 3 బాలిక ఫోటోలు 2. 4 పేరెంట్ ఆధార్ కార్డు. 5 పేరెంట్ పాన్ కార్డ్. 6 పేరెంట్ ఫోటోలు 2. అకౌంట్ ఓపెనింగ్: అకౌంటు ను పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకు లలో గాని ఓపెన్ చేయవచ్చు. విద్యాభ్యాసం కోసం ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళినప్పుడు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ కు మరియు ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకు కు అకౌంటును మార్చుకొనవచ్చు. పోస్ట్ ఆఫీస్ నుండి బ్యాంకుకు బ్యాంకు నుండి పోస్ట్ ఆఫీస్ కి నూరు రూపాయలు ఫీజు చెల్లించి అకౌంట్ ను మార్చు కొనవచ్చు. మనం డిపాజిట్ చేయు మొత్తం ఒక ఆర్థిక సంవత్సరానికి కనీస వార్షిక పెట్టుబడి 250 రూపాయల నుంచి గరిష్ఠంగా 1. 5 లక్షల రూపాయలక వరకు మన ఖాతాలో జమ చేయవచ్చు. ప్రతి నెల డిపాజిట్ చేయవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి డిపాజిట్ చేయవచ్చు. నెల నెల కట్టేవారు నిర్ణీత తేదీ లోపల డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అకౌంట్ ప్రారంభించినప్పటి నుండి 15 సంవత్సరాలు కట్టాలి. విత్ డ్రా: అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత విద్య కోసం 50% ఖాతా నుంచి ఉపసంహరణ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ: 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రీమెచ్యూర్ క్లోజర్: అకౌంట్ ఓపెన్ చేసిన బాలిక మరణించినప్పుడు. ఏదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు. అకౌంట్ ఓపెన్ చేసిన పేరెంట్/ గార్డియన్ మరణించినప్పుడు. పౌరసత్వం మారినప్పుడు. పై అన్ని సందర్భాలలో ఖాతాలు అర్ధాంతరంగా ముగించవచ్చు. ప్రయోజనాలు: ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అత్యంత సురక్షిత పథకము, రిస్క్ తక్కువ. పన్ను లాభాలు ఉంటాయి. మనం పెట్టుబడి పెట్టిన మొత్తము మరియు వరకు వచ్చే రిటర్న్ లపై పన్ను ఉండదు. ప్రతి సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు: మిగతా పథకాలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కన్న ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వడ్డీని జమ చేస్తారు. 2014- 2015 సంవత్సరాలలో9.1% వడ్డీ రేటు ఉండేది. మార్చి2022 సంవత్సరంలో 7.6 వడ్డీ రేటు ఉంది.ప్రతి సంవత్సరం వడ్డీరేట్లలోతేడా ఉంటుంది. టాక్స్ బెనిఫిట్స్: ఇన్కమ్ టాక్స్ 80c డిడక్షన్స్ ప్రకారం1.5 లక్షల వరకు టాక్స్ ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం ద్వారా లభించే వడ్డీ కి గాని మెచ్యూరిటీ కి గాని విత్ డ్రా యల్ అమౌంట్ కి కానీ ఎటువంటి టాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు.