INSPIRATIONAL QUOTATIONS
జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకోవాలంటే డబ్బు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం ముఖ్యమైనవి. మనం ఏ పని చేస్తామో ఆ పనిలో పూర్తిగా లీనమై పోవాలి. సహనం, ఓపికతో వాటిని పూర్తి చేయాలి. అప్పుడే ఫలితం లభిస్తుంది. జీవితంలో మనం ఎదగడం తోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి ఎంతోమంది మహనీయులు మహాత్మాగాంధీ,స్వామివివేకానంద,అబ్దుల్ కలాం,అరిస్టాటిల్ మరియునెల్సన్ మండేలా చెప్పిన INSPIRATIONAL QUOTATIONS ని ఆచరించినట్లయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడతాయి.
స్వామి వివేకానంద
* కెరటం నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు పడినా లేచి నందుకు.
* కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు.
* మందలో ఒకరిగా ఉండటాని కంటే వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు.
* బలమే జీవితం బలహీనతే మరణం.
* రోజుకి ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
అబ్దుల్ కలాం
* నీవు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు బాధ్యత తీసుకుంటే ఓడిపోలేవు.
* ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం కానీ ఓ మంచి స్నేహితుడు ఒక పెద్ద గ్రంథాలయంతో సమానం.
* విజయాన్ని చూసి మరిసిపోవద్దు ఎందుకంటే అది కేవలం నీ తొలి అడుగు మాత్రమే.
* మనిషికి జీవితంలో కష్టాలు అవసరం ఎందుకంటే అవి విజయాన్ని ఆస్వాదించడానికి అవసరం.
మహాత్మా గాంధీ
* లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం ఊడిపోతుంది.
* భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే, అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
* విద్యను దాచుకోవడం కన్నా పదిమందికి పంచితే మరింత పెరుగుతుంది.
* మేధావులు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు.
* మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటుంది.
* పొదుపు చేయవలసిన చోట ఖర్చు చెయ్యకు, ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు.
అరిస్టాటిల్
* నీవు సంపాదించిన దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు.
* కొన్ని సమయాలలో నీవు నష్ట పోవటమే నీకు గొప్ప లాభం.
* విద్య అనే వేర్లు ఎంత చేదుగా ఉన్నా అవి అందించే ఫలాలు చాలా మధురంగా ఉంటాయి.
నెల్సన్ మండేలా
* ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య.
* ఎప్పటికీ వదలకుండా కలలు కనే వాడే నిజమైన విజేత.
* ఒక పర్వతాన్ని అధిరోహించిన తర్వాతే అర్థమవుతుంది ఇంకా ఎక్కాల్సిన కొండలు ఎన్నో ఉన్నాయో అని.
* ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం జీవితాంతం ఎదురుచూసిన రాకపోవచ్చు.
ముఖ్యమైన కొటేషన్స్
* ఓడిపోతానని భయంతో ప్రయత్నం చేయకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు.
*విమర్శలు అన్నింటిలోనూ ఉత్తమమైనది ఆత్మ విమర్శ.
* ఎంత కష్టం వచ్చినా నీ బాధలు ఎవరికి చెప్పుకు ఈ లోకం ఎంత విచిత్రం అయినది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది రకాల తప్పులు వెదికేరకం.
* నీ జీవితమే నీకు టీచర్ ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
* అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు దాటితే జీవితం అదుపు తప్పుతుంది.
* మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి ఉన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది.
* చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికే తిరిగి రావు. అందుకే బంధాలను కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి.
* అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే. నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే.
* ప్రపంచంలో ఇద్దరే సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగినవారు. పడుకున్న వెంటనే 5 నిమిషాలలో నిద్ర పట్టే వారు.
* విజయం అనేది ఎప్పుడు సులభంగా రాదు, అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం.
* మంచి వాళ్ల దగ్గర రాముడు లాగే ఉండాలి. చెడ్డ వాళ్ళ దగ్గర రావణుడు లాగా ఉండాలి అప్పుడే బతకడం సాధ్యం.
* నీ గమ్యాన్ని చేరేవరకు ప్రయత్నించు ఏదో ఒక రోజు అది నీ దరి చేరుతుంది కానీ వదిలేసి మాత్రం దూరంగా పారిపోవద్దు.
* నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు, నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.
* తప్పు చేసిన మనుషులను వదిలేస్తారు నిజాయితీగా నిలబడితే శిక్షిస్తారు. ఇదే నేటి సమాజం తీరు.
* ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు.
* దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికిన అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు.
* రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకొన్నా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము.
* డబ్బుని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితం తో ఆడుకుంటుంది.
* నీటిలో పడిన ప్రతివాడు చనిపోడు ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు.
* ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
* మనిషి బరువు తో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే, కానీ మనసు బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు.
* రెక్కలు వచ్చాక ఎగరడం లో తప్పులేదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారికి వదిలేసి ఎగరడం కచ్చితంగా తప్పే.
*ఓటమి అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఒక అడ్డంకి మాత్రమే, అదే ఆ మార్గానికి చివర కాదు దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళితే గెలుపు మన సొంతమౌతుంది.
* నీ బలం ఎవరికి తెలియక పోయినా పర్వాలేదు ఈజీగా బ్రతికేయొచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు బతకనివ్వరు.
* నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం.
* నిన్ను పది అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నీవే 100 అడుగులు దూరంలో ఉండు.
* గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు దానిలో నీవు కొత్త కాదు నేను పాత కాదు.
* వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజం అనేది.
* ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిస గా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా విజేతగా నిలుపుతుంది.
* చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.
* ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానం లో సంస్కారం ఉంటుంది.
* ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది.
* ఎదురుచూసే ఓపిక కనుక మనలో ఉంటే, దూరం అయినా ప్రతిదీ మరొక రూపంలో మన ముందు ఉంటుంది.
INSPIRATIONAL QUOTATIONS