కేంద్రీయ విద్యాలయాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రీయ విద్యాలయ సంఘటన ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ విద్యాలయాలలోవివిధ టీచింగ్ ,నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఈ విశ్వవిధ్యాలయానికి 25 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. పన్నెండవ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నది.బారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
పోస్టులు పోస్టుల సంఖ్య దరఖాస్తు ఫీజు
1. అసిస్టెంట్ కమిషనర్ 52 2300
2. ప్రిన్సిపాల్ 239 2300
౩. వైస్ ప్రిన్సిపల్ 203 2300
4. పి జి టి 1409 1500
5. టి జి టి 3176 1500
6. లైబ్రేరియన్ 355 1500
7. ప్రైమరీ టీచర్( మ్యూజిక్) 303 1500
8. ఫైనాన్స్ ఆఫీసర్ 6 1500
9. అసిస్టెంట్ ఇంజనీర్( సివిల్) 2 1500
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 1 56 1500
11. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 322 1200
12. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 702 1200
13. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 54 1200
14. హిందీ ట్రాన్స్ లెటర్ 11 1500
దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పి హెచ్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులను ఆన్లైన్ లోనే అప్లై చేయాలి.
పరీక్ష
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్( సి బి టి) నిర్వహిస్తారు.
అర్హత
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈడీ, బీటెక్, బి పి ఇ డి, , డిప్లొమా , పీజీ డిప్లమా, సి ఎ, ఐ సి డబ్ల్యూ ఏ ఐ.
వయోపరిమితి
వివిధ పోస్టులకు వయోపరిమితి క్రింది విధముగా ఉన్నది
స్టే నో, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు, పి ఆర్ టి పోస్టులు 30 సంవత్సరాలు
హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లైబ్రేరియన్, టి జి టి లకు 35 సంవత్సరాలు
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు 50 సంవత్సరాలు
పి జి టి లకు 40 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిపాల్ కు 45 సంవత్సరాలు
వయోపరిమితి సడలింపు
ఎస్సీ, ఎస్ టి లకు ఐదు సంవత్సరాలు
ఓబీసీలకు మూడు సంవత్సరాలు
మహిళలు బోధన పోస్టులకు పి జి టి, టీ జి టి, లైబ్రేరియన్, పి ఆర్ టి లకు పది సంవత్సరాలు.
డీజే బిలిటి అభ్యర్థులకు
ఎస్సీ ఎస్టీలకు 15 సంవత్సరాలు
ఓబీసీలకు 13 సంవత్సరాలు
జనరల్ 10 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మెన్( గ్రూప్ ఏ పోస్టులకు)
జనరల్ 5 సంవత్సరాలు
ఓబీసీలకు 8 సంవత్సరాలు
ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మాన్( గ్రూప్ బి పోస్టులకు)
జనరల్ 3 సంవత్సరాలు
ఓబీసీలకు 6 సంవత్సరాలు
ఎస్సీ ఎస్టీలకు 8 సంవత్సరాలు
సెలక్షన్ విధానం
* రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు
ఏపీ – అనంతపూర్, గుంటూరు, కాకినాడ, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తుల ప్రారంభ తేదీ- డిసెంబర్ 5 2022.
దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 28 2022.
మరిన్ని వివరాలకు క్రింది వెబ్ సైట్ ను సంప్రదించండి
https:kvsangathan.nic.in
BEST OF LUCK