TELUGU SAMETHALUTELUGUB SAMETHALU

TELUGU SAMETHALU తెలుగు సామెతలు

 భాష తీయదనానికి సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు దోహద పడతాయి. భాషలో మార్పు సహజం. అలాగే ఒక సామెత లోని భాషలో కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే తరతరాలుగా ఆ సామెత లోని భావంలో మాత్రం మార్పు రావడం లేదు. విద్యాభ్యాసం చేసినా, చేయకున్నా తన మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా చమత్కారమైన నానుడిని వాడుతూ ఉంటారు. అందుకే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అని మన తెలుగు సామెత చెబుతోంది. జీవితం అనుభవాల కూడలి. అనుభవం నేర్పిన పాటమే సామెత మన జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ సమానంగా ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఆనందించడం, కష్టం వచ్చినప్పుడు బాధపడటం మన అనుభవంలో ఉన్నవే. సూక్ష్మంలో మోక్షం చూపించే ఈ సామెతలు మన ప్రాచీనుల విజ్ఞాన సంపదకు తార్కాణం. జీవితం నేర్పిన గుణపాఠం అనుభవం. అనుభవం అందించిన సందేశం సామెత. అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు అన్న నానుడి తెలుగు సామెతలుకు బాగా వర్తిస్తుంది. సామెతలను ఒక విజ్ఞాన ఖని తో పోల్చవచ్చు. ప్రజలను విజ్ఞాన వంతులుగా చేసే సామర్థ్యం సామెతలకు ఉంది. విషయం మనస్సుకు బాగా హత్తుకుని పోయేటట్లు పోలిక తోనో దృష్టాంతం తోనో చెవికి ఇంపుగా చెప్పబడేది సామెత.

 

  ముఖ్యమైన Telugu Samethalu.

* ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు.

* రామేశ్వరానికి పోయినా శనేశ్వరం తప్పలేదు.

* పేదవాని కోపము పెదవులకు చేటు.

* ఇంట గెలిచి రచ్చ గెలువు.

* ఇల్లు అలకగానే పండగ అయ్యిందా.

* దూరపు కొండలు నునుపు.

* ఆవలిస్తే పేగులు లెక్కపెట్టడం.

* ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి.

* ఆదిలోనే హంస పాదు.

* అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.

* చింత చచ్చినా పులుపు చావదు.

* గాడిద పుండుకు బూడిద మందు.

* కందకు లేని దురద కత్తిపీటకెందుకు.

* ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు.

* తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు.

* తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర.

* నాగలి ఉన్న ఊర్లో ఆకలి చేరదు.

* రైతు దున్నితే రాజులకు అన్నం.

* కోటి విద్యలు కూటికోసం.

* దొరలు ఇచ్చిన పాల కన్నా ధరణి ఇచ్చిన ధాన్యం మేలు.

* సొమ్మొకడిది సోకొకడిది.

* జననిని, ధరణిని నమ్మినవాడు చెడడు.

* వాన రాకడ, ప్రాణం పోకడ తెలియవు.

* తొలకరి వానలు మొలకల కు తల్లి.

* ఆరుద్ర లో అడ్డెడు చల్లితే పుట్టేడు పండును.

* అనురాధ లో అడిగినంత పంట.

* నడిమంత్రపు సిరి కి నెత్తి మీద కళ్ళు.

* లోభి బీద కంటే బీద.

* కలిమిగల లోభికన్నను పేద మేలు.

* ఆరుద్ర కురిస్తే దారిద్రం లేదు.

* ఉత్తర చూసి ఎత్తర గంప.

* ఇంటి కన్నా గుడి పదిలం మన్నట్లు.

* కీడెంచి మే లెంచాలి.

* గుడ్డి కన్నా మెల్ల మేలు.

* గుర్రం గుడ్డిదైనా దానాకు కొదవలేదు.

* పడ్డవాడు చెడ్డవాడు కాదు.

* పిట్ట కొంచెం కూత ఘనం.

* ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.

* ఆపదలో అడ్డుపడే వాడు చుట్టము.

* ఆ ఊరి దొర ఈ ఊరి తలారి.

* ఈత చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.

* ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు.

* చెప్పటం కంటే చేయడం మేలు.

* అడుసు తొక్కనేల కాలు కడగనేల.

* ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది.

* బోడి గుండుపై తాటికాయ పడ్డట్లు.

*గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు.

* మాటలు కోటలు దాటుతాయి చేతులు గడపలు దాటవు.

* ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరగదు.

* కొరివితో తల గోక్కున్నట్లు.

* గూట్లో దీపం నోట్లో ముద్ద.

* ఉప్పులేని పప్పు ఊరగాయ లేని సద్ది.

* అంటనప్పుడు ఆముదం రాసుకున్న అంటదు.

* పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు.

* పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.

* పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.

* లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.

* చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు.

* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు.

* రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు.

* గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం అన్నట్లు.

* ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.

* ఎంత చెట్టుకు అంత గాలి.

* ఎంత వెలుగుకు అంత చీకటి.

* ఉత్త కుండకు ఊపులు ఎక్కువ.

* ఏమీ లేని ఆకు ఎగిసి ఎగిసి పడితే అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది.

* నిండు కుండ తొణకదు.

* గురువు లేని విద్య గుడ్డి విద్య.

* గురువును మించిన శిష్యుడు.

* అల్ప విద్య మహా గర్వి.

* ఆపండితుని కంటే అర్ధ పండితుడే అపాయ కారి.

* చదవనంత వరకు కాకరకాయ చదివిన తర్వాత కీకరకాయ.

* సత్యం మించిన పూజ లేదు.

* అందరికీ మంచివాడు అనంతయ్య.

* కుక్క తోక వంకర.

* ఉంటే ఉగాది లేకపోతే ఏకాసి.

* ఉంటే ఆమీరు లేకుంటే ఫకీరు.

* సాక్షి కాళ్లు పట్టుకోవడం కన్నా వాది కాళ్లు పట్టుకోవడం మేలు.

* నిదానమే ప్రధానం.

* చూసి రా అంటే కాల్చి వచ్చాడట.

* అందితే జుట్టు అందకపోతే కాళ్లు.

* పరిగెత్తే వాడిని చూస్తే తరిమే వాడికి లోకువ.

* ఇల్లు కాలుతుంటే బావి తవ్వి నట్లు.

* పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ

* నిప్పు లేనిదే పొగ రాదు.

* ఏరు దాటి తెప్ప తగిలేసీనట్లు.

* ఆడలేక మద్దెల ఓడు.

* తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం.

* గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లు.

* తులసి వనంలో గంజాయి మొక్క.

* గోరుచుట్టు మీద రోకలి పోటు.

* అగ్నికి ఆజ్యం పోసినట్లు.

* చల్ల కొచ్చి ముంత దాచినట్లు.

* చెడ్డ కోతి వనమంతా చేరిచిందట.

* తీగ లాగితే డొంక కదిలినట్లు.

* పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు.

* పెళ్లికి పోతు పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్లు.

* మునిగే వాడికి తెలుస్తుంది నీళ్లలోతు.

* ఏ ఎండకు ఆ గొడుగు పట్టు.

* ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.

* దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు.

* అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు.

* పొరుగింటి పుల్ల కూర రుచి.

* చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు.

* రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.

* గతి లేనప్పుడు గంజే పానకము.

* ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగినట్లు.

* ఆకారపుష్టి నైవేద్య నష్టి.

* ఎలుకకు పిల్లి సాక్షి.

* ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్లు.

* ఏకు అయి వచ్చి మేకు అయ్యి బిగిసినది.

* గోరుచుట్టు మీద రోకటి పోటు.

* పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.

* ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.

* చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు.

* ఆవలిస్తే పేగులు లెక్కపెట్టడం.

* అందని ద్రాక్ష పండు పుల్లన.

* నిండు కుండ తొణకదు

* దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.

* అడుసు తొక్కనేల కాలు కడగనేల.

* ఎవరికి వారే యమునా తీరు.

* అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

* శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు.

* అమ్మ పోతే అడవి కొనబోతే కొరవి.

* ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మూత.

* రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్లు.

* చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.

* రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదలనట్లు.

* ఇంట గెలిచి రచ్చ గెలువు.

* ఇల్లు పీకి పందిరి వేసినట్లు.

* నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు.

* పిట్ట కొంచెం కూత ఘనం.

* ఆస్తి మూరెడు ఆశ బారెడు.

* ఇల్లు అలకగానే పండుగ కాదు.

* అందితే జుట్టు అందకపోతే కాలు.

* చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు.

* ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.

* కళ్యాణ మొచ్చినా కక్కొచ్చినా ఆగదు.

* పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.

* రాత్రంతా రామాయణం విని రామునికి సీత ఏమి కావాలని అడిగాడట.

* ఆవు నలుపు అయితే పాలు నలుపా?

* ఆరు నెలలు సాము చేసి మూలన ఉన్న ముసలిదాన్ని కొట్టాడట.

* దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వనట్లు.

* ఏనుగులు తినే వాడికి పీనుగులు పిండాకూడు.

* రోగి కోరింది పాలే వైద్యుడు చెప్పింది పాలే.

* అభ్యాసం కూసు విద్య.

* కాకి పిల్ల కాకికి ముద్దు.

* పోరు నష్టం పొందు లాభం.

* కలసి ఉంటే కలదు సుఖం ,

* కొత్త ఒక వింత పాత ఒక రోత.

* పెద్దల మాట చద్దన్నం మూట.

* ఆచారం ముందర, అనాచారం వెనుక.

* మొరిగే కుక్క కరవదు.

* మొక్కై వంగనిది మానై వంగునా.

* అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.

* బూడిదలో పోసిన పన్నీరు.

* సంతోషమే సగం బలం.

* అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్టూరం మేలు.

* అగ్గి మీద గుగ్గిలం.

* అగ్నికి వాయువు తోడైనట్లు.

* అడిగితే గాని అమ్మయినా అన్నం పెట్టదు.

* అదిగో అంటే ఆరు నెలలు.

* అయినవారికి ఆకుల్లో ను కానీ వారికి కంచా ల్లోను.

* ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు.

* ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు.

* ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.

* ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది.

* ఉన్న మాటంటే ఉలుకెక్కువ.

* ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది .

* ఎవరికి వారే యమునా తీరే.

* ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా.

* కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.

* కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది.

* కోటి విద్యలు కూటి కొరకే.

* కోతికి కొబ్బరికాయ దొరికినట్లు.

* గుడ్డు వచ్చి పిల్లిని వెక్కిరించినట్లు.

* గోరంత దీపం కొండంత వెలుగు.

* గోరుచుట్టు మీద రోకలి పోటు.

* చాప కింద నీరులాగా!

* చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు.

* తడి గుడ్డతో గొంతు కోయుట.

* తనదాకా వస్తేగానీ తలనొప్పి బాధ తెలీదు!

* తాతకు దగ్గులు నేర్వ నగునా!

* తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు.

* తీగ లాగితే డొంక కదిలినట్లు.

* తినబోతూ రుచి అడగడనేల!

* తులసి వనంలో గంజాయి మొక్క.

* దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు.

* దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు.

* నిజం ఆడితే నిష్టూరం.

* పిండి కొద్దీ రొట్టె.

* పెదవి దాటితే పెన్నా దాటినట్లు.

* పెరుగుట విరుగుట కొరకే.

* పోరు నష్టం పొందు లాభం.

* మంత్రాలకు చింతకాయలు రాలుతాయా!

* మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.

* మొక్కై వంగనిది మానై వంగునా?

* విరిగే దానికంటే వంగేదే మేలు.

* తిలాపాపం తలా పిడికెడు.

* తలపాగా చుట్టడం రాక తల వంకర అన్నట్లు.

*ధనికుడి లోభం దరిద్రుడి దానం.

ముగింపు

సామెతలలో సాంఘిక జీవితం, సాంఘిక జీవితంలో సామెతలు ఒకదానికొకటి పెన వేసుకున్నాయి. సామెతలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. సామెతలు కూర్చేది ఒకరే అయినా అనుభవం మాత్రం ప్రజలందరిదీ. TELUGU SAMETHALU సాంఘిక చరిత్ర నిర్మాణానికి, ప్రాచీన సంస్కృతికి ఆధారాలు.