ABDUL KALAMA P J ABDUL KALAM BIOGRAPHY

A P J ABDUL KALAM జీవిత చరిత్ర

అబ్దుల్ కలాం వారి ఆత్మకథ ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు. కలాం గారి మాటల్లోనే జైనులాబ్దిన్ కొడుకు కథ, అన్నకు సాయం చేసే వార్తా పత్రికలు అమ్మిన పిల్లవాని కథ, శివ సుబ్రహ్మణ్య అయ్యర్, ఇయోదురై సో లోమోన్ పెంచి పెద్ద చేసిన విద్యార్థి కథ, పాండ లై వంటి ఉపాధ్యాయులు బోధించిన అభ్యాసి కథ, ఎం జి కె మీనన్ తో గుర్తించబడిన సైంటిస్ట్ కథ, ప్రొఫెసర్ సారా బాయ్ తో తీర్చిదిద్దబడిన ఇంజనీర్ కథ, వైఫల్యాలతో పరీక్షించబడిన శాస్త్రవేత్త కథ.

ప్రొఫెసర్ గా, రచయితగా, శాస్త్రవేత్తగా భారతదేశపు మిస్సైల్ మాన్ గా, రాష్ట్రపతిగా భారతీయుల హృదయాలలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కలాం గారి జీవితం నేటి యువతకు ఆదర్శం.

జననం

అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న మధ్యతరగతి తమిళ కుటుంబంలో తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అను పుణ్యక్షేత్రంలో ఆవుల ఫకీర్ జనులుద్దీన్, ఆసియమ్మ దంపతులకు జన్మించారు. అబ్దుల్ కలాం గారికి ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క ఉన్నారు. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఆవుల ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం.

బాల్యం

పేద కుటుంబం కావడం తో కుటుంబ అవసరాల కోసం అబ్దుల్ కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ అవసరాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి వార్తాపత్రికలను పంపిణీ చేశారు.

విద్యాభ్యాసం

తన పాఠశాల విద్యను రామేశ్వరంలో పూర్తి చేసిన తర్వాత రామనాథపురం హై స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. రామనాథపురం పాఠశాలలో ఇయదురై సోలోమన్ అనే గురువుగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ గురువుగారు చెప్పే విషయాలు కలాం గారికి చాలా ఆసక్తికరంగా ఉండేవి వారి పాఠ్యాంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ ఉండాలి అనే ఉపదేశం గురువుగారి దగ్గర నుంచి తెలుసుకున్నాడు నాకేదైనా సంభవించాలని నేను అనుకునే ముందు నేను గట్టిగా ఆకర్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని కలామ్ గారి విశ్వాసం.

కలాం గారికి చిన్నప్పటినుంచి ఆకాశపు రహస్యా లన్న, పక్షుల ప్రయాణ మన్నాఅమితాసక్తి. కొంగలు, సముద్రపు గువ్వలు ఎగురుతూ ఉండడం చూస్తూ నేను కూడా అలా ఎగరాలని అనుకునేవాడు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి భౌతిక శాస్త్రంలో గ్రాడుయేషన్ పట్టాని పొందారు. మద్రాసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

ఉద్యోగం

వైమానిక దళంలో చేరాలని డెహ్రాడూన్ వెళ్లగా అక్కడ ఎంపిక కాలేదు. తర్వాత ఢిల్లీకి వెళ్లి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగంలో చేరారు. తరువాత1959 లో డి టి డి మరియు ఏ ఐ ఆర్ లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గా చేరారు. తర్వాత కాన్పూర్ కు బదిలీ అయినారు. ఎరో నాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ బెంగళూరుకు బదిలీ అయ్యారు.

                                19 69 లో ఇస్రోలో చేరి మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ ఎల్ వి-3 తయారు చేయడంలో పనిచేశాడు. ఎస్ ఎల్ వి-3 పరీక్ష విజయవంతమైన తర్వాత సతీష్ ధావన్ తో పాటు అబ్దుల్ కలాం గారు ఇందిరాగాంధీని కలిశారు. ఇస్రో లో పనిచేయడం తాను సాధించిన విజయాలలో ముఖ్యమైనది అని పేర్కొన్నాడు. రీసెర్చ్ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలో నెగ్గి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తుంబాలో రాకెట్ ఇంజనీర్ గా నియమింపబడ్డారు. ఇక్కడ తయారైన రాకెట్లకు రోహిణి, మేనక అనే పేర్లు నామకరణం చేశారు.

1982 నుండి 1992 కొరకు అగ్ని, పృథ్వి, ఆకాష్, త్రిశూల్, నాగ్ క్షిపణులను కలామ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ప్రయోగింపబడినవి. జైపూర్ లో జరిగిన సైన్స్ కాంగ్రెస్ లో నా మేధాశక్తి ని మీ బాధలు నివారించేందుకు వినియోగిస్తాను అని ప్రకటించారు. తర్వాత ప్రధానమంత్రికి వైజ్ఞానిక విషయాల ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఫోఖ్రాన్ లో జరిగిన అణు పరీక్షలలో కలాం ముఖ్య భూమిక పోషించారు.

రచనలు

ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ పైర్- ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏపీ జె అబ్దుల్ కలాం . 

పురస్కారాలు

భారత ప్రభుత్వం పద్మశ్రీ,1981 లో పద్మభూషణ్,1990 లో పద్మ విభూషణ్,1997 లో భారతరత్న బిరుదులతో సత్కరించింది.1997 లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత పురస్కారం అందుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇచ్చాయి.

రాష్ట్రపతి

దీక్షా దక్షితులు కలిగిన అబ్దుల్ కలాంను ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతిగా ప్రతిపాదించగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బలపరిచింది అయితే వామపక్ష పార్టీలు లక్ష్మీ సెహగల్ ను పోటీలో దింప గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2002లో రాష్ట్రపతి పదవి వరించింది. భారతదేశానికి 11 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల రాష్ట్రపతిగా ప్రసిద్ధి గాంచారు.2007 జూలైలో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత మరల ఉపాధ్యాయ వృత్తికి అంకితమయ్యారు.

కలలు కనండి— వాటిని సాకారం చేయండి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు బాలలతో దగ్గరై ఆనందాన్ని పంచుకున్నారు.    A P J ABDUL KALAM గారు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 2015 జూలై 27 ఉపన్యాసం ఇస్తుండగా తుది శ్వాస విడిచారు.